విశాఖపట్నంలో నోట్ల మార్పిడి కేసులో పట్టుబడ్డ మహిళా రిజర్వ ఇన్స్పెక్టర్ స్వర్ణలతకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలపై ఆసక్తితో ఆమె సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఓ కొరియోగ్రాఫర్‌ను కూడా నియమించుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘చిరు ప్రయత్నం’ అంటూ చిరంజీవి, శ్రీదేవి సూపర్ హిట్ పాట ‘అబ్బనీ తీయని దెబ్బ’కు డ్యాన్స్ చేసిన ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒక రాజకీయ నాయకుడు తాను తీయబోయే సినిమాలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘ఏపీ 31’ పేరుతో ఈ సినిమాకు సంబంధించి స్వర్ణలత పోస్టర్ కూడా రిలీజైంది. బాధ్యత గల విధుల్లో ఉండి, నోట్ల మార్పిడి కేసులో నేవీ మాజీ ఉద్యోగులను బెదిరించి లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో పోలీసులు స్వర్ణలతను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రూ.90 లక్షల విలువైన 500 రూపాయల నోట్లు ఇస్తే.. కోటి రూపాయల విలువైన రూ. 2000 నోటు ఇస్తామని ఆశజూపి.. చివరి నిమిషంలో సినీ ఫక్కీలో ఎంట్రీ ఇచ్చిన ఇన్స్పెక్టర్ స్వర్ణలత.. కేసు బుక్ చేస్తానంటూ వారిని బెదిరించి, లక్షలు గుంజినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వర్ణలత డ్యాన్స్ వీడియోలు..