పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ ను ఆయన కార్యాలయంలో శనివారం సత్తెనపల్లి మండల రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. 167 ఏజీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సత్తెనపల్లి మండలంలో భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకావాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రైతుల చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుని సానుకూలంగా స్పందించిన కలెక్టర్, రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.