అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ బిజినెస్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రెంచ్ వ్యాలీ ఎయిర్‌పోర్టు సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ విమానం లాస్ వేగస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa