బోగాపురం మండలంలోని రామచంద్ర పేటలో శనివారం లోకం మాధవి ఇంటింటికి జనసేన కార్యక్రమం చేపట్టగా.. రామచంద్ర పేట గ్రామానికి చెందిన మహిళలు లోకం మాధవి ని ఘనంగా స్వాగతించారు. గ్రామంలోని ప్రతి గడపగడపకి తిరుగుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం వారి ఆధ్వర్యంలో సుమారు 40కుటంబాలకి చెందిన 150 మంది జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.