గరుగుబిల్లి మండలంలో గొట్టివలస గ్రామంలో మూడు రోజులుగా తిష్ట వేసిన ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. పగటిపూట సమీప తోటల్లో బస రాత్రి సమయంలో గ్రామాలలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గొట్టపు సూర్యనారాయణ చెందిన ట్రాక్టర్ తొట్టెను ఆదివారం ధ్వంసం చేశాయి. ఏ క్షణాన ఎవరికైనా దాడి చేస్తాయో నన్న భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు.