తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారు... లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. కారులో తిరుమల నుంచి శ్రీకాళహస్తి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa