భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గౌరవ్ యాదవ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం వరద సంబంధిత అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి పంజాబ్ పోలీసులు విస్తృతమైన చర్యలు తీసుకున్నారు. వరదల నివారణకు రాష్ట్ర కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, సంబంధిత అధికారులు తమ జిల్లాల్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు జిల్లాల నుంచి గంటకోసారి నివేదికలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌టిఆర్‌ఎఫ్) బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ప్రత్యేక డిజిపి అర్పిత్ శుక్లా తెలిపారు. శనివారం చండీగఢ్‌లోని వాతావరణ శాఖ పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.