టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మంగళవారంతో 2 వేల కిలో మీటర్లు పూర్తి చేసుకోనుంది. 153వ రోజు కొనసాగే ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి వద్ద చేరుకొని ఈ మైలురాయిని అధిగమించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలోని వరదరాజస్వామి గుడి వద్ద జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో 13 కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యువగళం చీఫ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ ఆధ్వర్యంలో ఈ కమిటీలు యాత్ర సజావుగా సాగేందుకు అనుక్షణం లోకేష్ కు అండగా నిలుస్తున్నారు. వీరితో పాటు 100 మంది పసుపు సైనికులు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ లోకేష్ కు రక్షణగా నిలుస్తున్నారు.