తిరుపతి నగరంలో రోడ్ల సేఫ్టీకి టీటీడీని సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని తిరుపతి నగరపాలక కమిషనర్ హరిత ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. గత స్పందన ఫిర్యాదులపై మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ అన్ని విభాగాల అధిపతులతో సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.