ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నావో, ఎంతమంది బిడ్డలను కన్నావో.. ఒకసారి చరిత్రని పవన్ కళ్యాణ్ చూసుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు. వాలంటీర్ వ్యవస్థపై దారుణమైన ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకసారి గ్రామాల్లోకి వచ్చి, వాలంటీర్లు పడుతున్న కష్టాల్ని చూడాలని చెప్పారు. మెగా కుటుంబంలో చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ పుట్టడం దురదృష్టం, ఖర్మ అని మండిపడ్డారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.