పవన్ కల్యాణ్ హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయని, అబద్ధాలు, కించపరిచే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పవన్‌కు ప్రజలే చెప్పులు చూపిస్తారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని నిత్యం నిందించడమే పనిగా పెట్టుకున్నావా..? అని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. పవన్ కాకిలెక్కలను ప్రజలెవరూ పట్టించుకోరన్నారు. వారాహి యాత్ర అంటూ తిరుగుతూ పవన్ సైకోలా మాట్లాడుతున్నాడని, ఆయన హావభావాలు ఉన్మాదిలా ఉన్నాయన్నారు. కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎమ్మెల్యేలయ్యారని, మరి పవన్ కల్యాణ్ ఎందుకు ఎమ్మెల్యే కాలేదని ప్రశ్నించారు. పవన్ తల్లి, భార్యను అవమానించింది టీడీపీ నేతలేనని, అయినా వారి పక్షానే పవన్ నిలబడ్డాడన్నారు.