పాడా పరిధిలో పులివెందుల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను డిసెంబర్ మాసం నాటికి సంపూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్ లోని స్పందన హాలులో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేసీ గణేష్ కుమార్, కడప కమీషనర్ ప్రవీణ్ చంద్, డిఎఫ్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.