ప్రతి పల్లె గడపలో సీఎం జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం అందుతోంది. అర్హత ప్రామాణికంగా ప్రజలు లబ్దిపొందుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం పాకాల మండలం ఇర్రంగారిపల్లి పంచాయతీ పరిధిలోని ముద్దులపల్లి గ్రామంలో గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపలో మోహిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ప్రతి ఇంటా దుశ్శాలతో ఘనంగా సత్కరించారు.