జూన్ 4 నుంచి తాము చేసిన ఎదురుదాడిలో ఉక్రెయిన్ 26 వేల మంది సైనికులను కోల్పోయిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. ఉక్రెయిన్‌తో ఘర్షణపై తాజాగా అక్కడి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందన్నారు. ఉక్రేనియన్ సాయుధ దళాల వద్ద ప్రమాదకర స్థాయిలో ఆయుధాలు లేకుండా బలహీనపరుస్తున్నామన్నారు. వారిపై తమ సైన్యం సమర్థవంతంగా పోరాడుతున్నట్లు చెప్పారు.