పులివెందులకు సీఎం జగన్ చేసిందేమిలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. వేంపల్లె టీడీపీ కార్యాలయంలో మంగళవారం వైసీపీ నుంచి 40కుటుంబాలు టీడీపీలో చేరగా బీటెక్ రవి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎం వెంకటేశ, ఇస్మాయిల్, రజాక్, బాష, మణి తదితర 40కుటుంబాలు పార్టీలో చేరినట్లు తెలిపారు. బీటెక్ రవి విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల వైసీపీ క్యాడర్‌లో పూర్తి నిర్లిప్తత నెలకొందన్నారు. మూడేళ్ల కిందటే ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయిస్తానని చెప్పిన జగన ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎమ్మెల్సీగా నేను ప్రశ్నించిన తర్వాత అరటి, మామిడి, రైతులకు హెక్టార్‌కు రూ.50వేలు పరిహారం ఇచ్చారని, ఇన్సూరెన్స పరిధిలోకి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. మండల కన్వీనర్ మునిరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన బాలస్వామిరెడ్డి, మాజీ కార్పొరేషన డైరెక్టర్ షబ్బీర్, నిమ్మకాయల దర్బార్, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.