ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంపు, సీఆర్డీఏలో ఆర్ 5 జోన్ లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, 20 ఏళ్లకు ముందు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు పొందిన వారికి ఆ భూముల పై సర్వహక్కులు, 66 వేల మందికి లంక భూముల పై హక్కులు, మూలపేట-భావనపాడు పోర్టు నిర్మాణంకు రూ.3880 కోట్ల లోన్ కు ఆమోదం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.