బుద్ధవరపు నారాయణ మూర్తి పంతులు విశాఖపట్నం నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు. బుధవారం జీవీఎంసీ కార్యాలయంలోని బుద్ధవరపు నారాయణ మూర్తి పంతులు 5వ తరం వారసులు మేయర్ ను కలిసి సాలువ కప్పి పుష్పగుచ్చం అందించారు. నారాయణమూర్తి పంతులు ఐదోతరం వారసులు మాట్లాడుతూ పంతులుగారు జ్ఞాపకార్థం ఆయన ఫోటో జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో పెట్టినందుకు మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు.