ఉద్యాన పంటల లక్ష్యాన్ని సాధించాలని గజపతినగరం మండల ఏపీవో సిహెచ్ రామారావు ఆదేశించారు. బుధవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 40 ఎకరాల్లో ఉద్యాన పంటల లక్ష్యం కాక ఇంతవరకు 27 ఎకరాలు ప్లాంటేషన్ జరిగిందన్నారు. మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇంకా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే గుర్తించాలన్నారు.