ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే దశలో పశ్చిమ్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల హింసాత్మక ఘటనల్లో 40 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2023, 08:54 PM

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. మొత్తం 3,317 పంచాయతీల్లో 2,552..232 పంచాయతీ సమితిలు, 12 జిల్లా పరిషత్‌లను టీఎంసీ చేజిక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కేవలం 212 పంచాయతీలు, ఏడు సమితులతోనే సరిపెట్టుకుంది. జిల్లా పరిషత్‌లో ఆ పార్టీ అసలు ఖాతాయే తెరవలేదు. ఇంకా, కొన్ని చోట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో ఫలితాలు వెలువడాల్సి ఉంది. మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉణ్న పశ్చిమ్ బెంగల్ బెంగాల్‌లోని 63,229 గ్రామ పంచాయతీ సీట్లు, 9,730 పంచాయతీ సమితి సీట్లు, 928 జిల్లా పరిషత్ స్థానాలు కలిపి మొత్తం 74,000 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. మంగళవారం ఉదయం లెక్కింపు చేపట్టారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడటానికి మరో రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు.


ఇప్పటి వరకూ టీఎంసీ 35,000 పంచాయతీ సీట్లలో విజయం సాధించగా... పలుచోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 8,600 స్థానాల్లోనూ.. లెఫ్ట్‌ ఫ్రంట్‌ 2,534 స్థానాల్లోనూ విజయం సాధించాయి. కాంగ్రెస్‌ 2,300 స్థానాలను గెలుపొందింది. పోలింగ్‌ రోజున చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డైమండ్‌ హార్బర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. కానీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. హౌరాలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని స్థానికులు ముట్టడించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని భాన్‌గఢ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఓ పోలీస్ అధికారి గాయపడ్డారు.


రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసలో 40 మందికిపైగా చనిపోయారు. ఒక్క ఎన్నికల పోలింగ్ రోజునే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్లను లూటీ చేయడానికి టీఎంసీ గూండాలు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టింది.


మరోవైపు, పంచాయతీ ఎన్నికల్లో విజయంపై టీఎంసీ నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ట్విట్టర్‌లో స్పందించారు. ‘పశ్చిమ్ బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వాన్ని కించపరిచేలా నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరిత ప్రచారం కూడా ఓటర్లను మభ్యపెట్టలేకపోయింది.. ‘మమతకు ఓటెయ్యొద్దు’ అన్న ప్రతిపక్షం చేపట్టిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com