అమెరికా పౌరులను మోసం చేశారన్న ఆరోపణలతో తొమ్మిది మంది వ్యక్తులతో కూడిన నకిలీ కాల్ సెంటర్‌ను గోవా క్రైమ్ బ్రాంచ్ బుధవారం ఛేదించింది. దక్షిణ గోవాలోని మజోర్డా, సల్సెట్‌లో అక్రమ కాల్ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించి, తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (క్రైమ్ బ్రాంచ్) నిధిన్ వల్సన్ తెలిపారు.ఈ నిందితులందరూ తమ ఉమ్మడి ఉద్దేశంతో నకిలీ అక్రమ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఎక్స్-లైట్ యాప్ ద్వారా అమెరికా పౌరుల వ్యక్తిగత వివరాలను సేకరించారని ఆయన చెప్పారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న బాధితులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు రూపంలో జరిమానా/పెనాల్టీ చెల్లించాలని చెప్పి, భారతీయ కరెన్సీలోకి మార్చడం ద్వారా డబ్బును దోచుకున్నారు.