దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది మహా ఉగ్ర రూపం దాల్చింది. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో పోటెత్తుతోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు నది 207.71 మీటర్లు దాటి ప్రవహించింది. రాత్రి 10 గంటలకు 208.05 మీటర్లకు పెరిగింది. రాత్రి 8 గంటల సమయంలో హత్నికుండ్ నుంచి 1.47 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. యమునా నది 1978లో 207.49 మీటర్ల మేర ప్రవహించడమే ఇప్పటివరకు ఉన్న రికార్డు.