అమర్నాథ్ యాత్రలో గత 24 గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో కొనసాగే ఈ యాత్రలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో భద్రతా విధులకు వెళ్లిన ఓ ఐటీబీపీ అధికారి, మరో సేవాదార్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధిక ఎత్తులో ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే ముప్పు ఉంటుందని వారు చెప్పారు.