రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కులాన్ని మరోసారి నిర్ధరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అధికారులు గోల్డెన్ డేటా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. వాలంటీర్లు 2021లో నెల పాటు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో కుటుంబాల వారీగా కులం/ఉపకులం డేటాను నమోదు చేయగా, ఇప్పుడు ఆ సమాచారాన్ని వీఆర్ఓల చేత మరోసారి పరిశీలింపజేసి గోల్డెన్ డేటాను రూపొందిస్తారు.