విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీ పార్టీకి రాజీనామా చేసారు. అయన మాట్లాడుతూ.. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టి కి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలు, కింది స్థాయిలో తీర్చ లేనప్పుడు ఈ పదవిలో ఉండటం, సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై... భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటానని రమేష్ బాబు తెలిపారు.