వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ , వలంటీర్లపై వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు ఐన సంగతి తెలిసిందే. అలానే పవన్ కళ్యాణ్‌పై నిన్న విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 153 ప్రకారం పవన్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు నమోదైంది.