రాజధాని అమరావతిలో జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ఆర్-5 జోన్లో ఈ నెల 24వ తేదీన 47 వేల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలానే శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు- మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,884.70 కోట్ల రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్ఫసీ) నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకరించింది. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంకభూములు కేటాయింపునకూ ఆమోద ముద్ర వేసింది.