సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, బహుశా ఈ వారంలోనే దాఖలు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. శిక్ష నిలుపుదల ఉత్తర్వులిచ్చేందుకు గుజరాత్ హైకోర్టు గత వారం నిరాకరించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa