జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరులో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పేవరకు తమ నిరసనలు ఆగవని వాలంటీర్లు తెలిపారు.