విశాఖ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే వరి విత్తనాలు వేసిన ఆకు మడులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అన్నదాతలు అంటున్నారు. ఇంతవరకు వరి ఆకుమడులు పోయని రైతులు, విత్తనాలు చల్లడానికి సన్నద్ధం అయ్యారు. భారీ వర్షాలు కురిసి రిజర్వాయర్లలో నీరు చేరి నీటి ప్రవాహనం పెరిగితే ఖరీఫ్ వరి సాగుకు ఢోకా వుండదని రైతులు గురువారం చెప్పారు.