దేశ సరిహద్దులు దాటి నేపాలీలు తమ కుటుంబంతో భారత్కి వస్తున్నారు. మంచి వాళ్లలా నటించి ఇంట్లో పనికి చేరుతున్నారు. నమ్మకం కుదిరాక టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్లోని ఓ బడా వ్యాపారి ఇంట్లో నమ్మకంగా ఉండి రూ.5 కోట్లు కాజేశారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏడాది క్రితం హైదరాబాద్లోని ఆయా ప్రాంతాల్లో ఇలాంటి తరహాలోనే దొంగతనాలు జరిగాయి. నేపాల్ ముఠాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.