ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారని విశాఖలోని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి చెప్పారు. గురువారం తాడేపల్లిలో విద్యపై జరిగిన సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలను వీసీ వివరించారు. అంతర్జాతీయంగా పరీక్షా విధానం వేరుగా ఉంటుందని సీఎం తెలిపారని, ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.