ఆసియా అథ్లెటిక్స్ లో విశాఖ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి కి స్వర్ణం సాధించింది. గురువారం బ్యాంకాక్ వేదికగా జరిగిన ఫైనల్స్లో జపనీస్ స్ప్రింటర్లకంటే మేటి ప్రదర్శన కనబరిచింది. కేవలం 13. 09 సెకన్లలో వంద మీటర్ల లక్ష్యాన్ని అందుకుంది. విశాఖకు చెందిన జ్యోతికి అంతర్జాతీయ ఈవెంట్లో ఇదే తొలి స్వర్ణం కాగా భారత్ కు ఈ విభాగంలో స్వర్ణం అందించిన క్రీడాకారిణి కూడా జ్యోతియే కావడం గమనార్హం.