పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వాలెంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు గుర్తించారని తెలిపారు. ఇందులో ఎంపీటీసీ వెంకటేష్ పాల్గొన్నారు.