మరో 160 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ బటన్ నొక్కినా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడటం లేదని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘మహాశక్తి’ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. మద్య నిషేధం చేస్తానని చెప్పి జగన్ మాట మార్చారని అన్నారు. 50 రోజుల పాటు ‘మహాశక్తి’ పథకాలపై ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.