ఏపీలో వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు విజయవంతం కావడం వల్లే జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో నివసించే పవన్ కు ఏపీతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. పవన్ పోటీ చేసే స్థానంలో వాలంటీర్ ని నిలబెట్టి గెలిపించి చూపిస్తామన్నారు. నిజంగా జనసేనానికి దమ్ముంటే పాత్రులు లేకుండా బరిలోకి దిగాలని ఛాలెంజ్ విసిరారు.