వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రెండు రోజుల్లోనే రూ.4,300 పెరిగింది. గురువారం రూ.2,500 పెరిగిన ధర శుక్రవారం రూ.1,800 పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో కిలో ధర రూ.81,300కి చేరింది. మరోవైపు. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలుగా ఉంది.