టీడీపీ యువనాయకుడు నారా లోకేశ్ శనివారం ఉదయం రాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు. ఏపీ గంజాయి రాష్ట్రంగా మారకుండా చర్యలు తీసుకోవాలని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో రాష్ట్రం ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటూ మహిళలు తమ వద్ద వాపోయారు అని గవర్నర్‌ను కలిసి లోకేశ్.. గంజాయికి సంబంధించిన వివరాలను సీడీ, పెన్ డ్రైవ్ రూపంలో గవర్నర్‌కు ఇచ్చారు. లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యులు మండల చైర్మన్ షరీఫ్, కొల్లు రవీంద్ర.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.