పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదుపులోకి తీసుకున్నాయి. అమృత్సర్ జిల్లా మీర్పురా గ్రామం సమీపంలోకి వచ్చిన పాక్ వ్యక్తిని BSF జవాన్లు పట్టుకొని విచారించారు. అనుకోకుండా భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలడంతో మానవతా దృక్పథంతో అతన్ని పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించామని BSF అధికారులు తెలిపారు.