అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిసింది. ఫైజాబాద్‌కు 185 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే శనివారం ఉదయం మహారాష్ట్రలోని హింగోళిలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.6గా తీవ్రత నమోదైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించారు.