వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందజేయాలని కోరుతూ యాడికి మండలంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎం ఈఓ కాశేప్ప కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ గౌతమి సర్కులర్ జారీ చేయడం పై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.