సిఎం జగనన్న రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జగనన్న సురక్ష కార్యక్రమంతో అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శమని ఉరవకొండ నియోజక వర్గం వైకాపా ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ పట్టణం సచివాలయం 2 పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆలయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా ధృవ పత్రాలు అందజేశారు.