కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు జెడ్పీ హైస్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ ఇచ్చి వేధించాడో ఎలక్ట్రీషియన్. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. రెండు రోజుల క్రితం స్కూల్‌లోని క్లాస్ రూమ్‌లో టీవీలు పెట్టేందుకు స్విచ్ బాక్స్‌లు ఏర్పాటు చేసేందుకు సూరిబాబు అనే ఎలక్ట్రీషియన్‌కు పని అప్పగించారు. అతడు తన సహాయకులతో స్కూల్‌కు వచ్చి పని ప్రారంభించారు. పదవ తరగతి బీ సెక్షన్‌లో పనులు చేసే క్రమంలో సూరిబాబు పనిచేస్తూ విద్యార్థినులతో మాటలు కలిపాడు.
ఆ తర్వాత విద్యార్థినిలను ఎలక్ట్రీషియన్ ఇబ్బంది పెట్టాడు. విద్యుత్ వైర్లను విద్యార్థినిలు కూర్చున్న బల్లలకు కనెక్ట్ చేశాడు. ఆ ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్ వచ్చిందా అంటూ పలుమార్లు విద్యార్థినిలు కూర్చున్న బల్లలకు విద్యుత్ వైర్లను కనెక్ట్ చేశాడు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినిలకు విద్యుత్ షాక్ తగిలింది.. ఓ విద్యార్థిని షాక్‌కు గురైన ముగ్గురు విద్యార్థినులు ముఖం కడుక్కునేందుకు వచ్చారు. నీరసంతో ఓ విద్యార్థిని పడిపోయింది. తమకు చేతులు నొప్పులు పుడుతున్నాయంటూ ఉపాధ్యాయులకు ముగ్గురు ఫిర్యాదు చేశారు.
టీచర్లు వారిని దగ్గరలోని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆర్ఎంపీ వారిని ఇంటికి పంపించారు. ఈ విద్యుత్ షాక్ ఘటనపై తల్లిదండ్రులకు విద్యార్ధులు సమాచారం ఇచ్చారు. కంకిపాడు మండల శాఖ అధికారులకు విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయునిపై శాఖాపరమైన చర్య లు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి హామీ ఇచ్చారు. నిందితుడిని పాఠశాలకు పిలిపించి నిలయదీయటంతో సరదాగా ఈ పని చేశానన్నాడు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.