వావి వరసలు మరిచి కూతురు వరసైన యువతిని ఓ కామాంధుడు గర్భవతి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. కేసు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని బదిలీ చేశారు. దాంతో బాధితురాలు తన తండ్రిని తీసుకుని స్టేషన్కు వెళ్లి వివరాలు చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.