ఓడరేవులు, పారిశ్రామిక పార్కులు మరియు సెజ్‌ల కోసం 24/7 హైవే కనెక్టివిటీని అభివృద్ధి చేయడంపై బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు చొరవతో విశాఖలో శనివారం పోర్టులో సమావేశం నిర్వహించారు. పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన, భారీ వాహనాల నిలిపివేత, పోర్టుకు నేరుగా అంతరాలు లేని అనుసంధానానికి తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాలపై చర్చించారు. విశాఖ పోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించనన్నామన్నారు.