విశాఖ నగరంలో వర్షాలు పడుతున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి చారించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసిరావు ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. శనివారం వుడా చిల్డ్రన్ ఎరీనాలో నగర పరిధిలోని ఏఎన్ఎంలు, మలేరియా సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులువ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.