విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు బరిలో ఉన్నారు. ఈనెల 19వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు.