అదాని గంగవరం పోర్టులో చట్టాలు అమలు చేయాలని కోరిన కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలోని జగదాంబ జంక్షన్ సమీపాన గల సిటు కార్యాలయంలో గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అఖిలపక్ష కార్మిక సంఘం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.