ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... ఎస్సీ కాలనీ వాసి నాగేంద్రబాబును గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొంతు కోసి హత్యకు పాల్పడ్డారంటూ మృతుని భార్య ఇమాంబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా సీఐ లు నారాయణయాదవ్, ఇబ్రహీం అదే గ్రామానికి చెందిన ఆకుమల్ల నగేష్, మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వివాహేతర సంబంధమే నాగేంద్రబాబు హత్య కు దారి తీసిందనే విషయం తెలిసిందన్నారు. హతుడు నాగేంద్రబాబుకు, వరుసకు కుమారుడ య్యే నగే్షకు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.ఈ విషయ మై నగే్షను దగ్గరకు రానివ్వవద్దని సదరు మ హిళను నాగేంద్రబాబు బెదిరించాడు. ఈ క్రమంలోనే నాగేంద్రబాబును అడ్డు తొలగించుకునేందు కు సదరు మహిళ, నగేష్ కుట్ర పన్నినట్లు తెలి పారు. నాగేంద్రబాబు తన సోదరి ఇంటి మిద్దెపైన నిద్రిస్తుండగా, నగేష్ కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు, నగేష్ నేరాన్ని అం గీకరించినట్లు డీఎస్పీ చెప్పారు. హత్య చేసిన నగే్ష, కుట్రలో భాగమున్న సద రు మహిళను సీఐ నారాయణయాదవ్ అరెస్టు చేశారన్నారు.