తెలుగు వారి ఆధ్వర్యంలో అమెరికాలో గత కొన్నాళ్లుగా నిర్వహించబడుతున్న తానా సేవలను ఎప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తృతం చేస్తామని ఆ సంఘ నూతన అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు. అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘ అధ్యక్షునిగా నిరంజన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. ఉచిత కంటి చికిత్సలు, క్యాన్సర్ శిబిరాలు, రైతులకు అవసరమైన రక్షణ పరికరాలు, ఈఎన్టీ చికిత్సల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు పేద విద్యార్థులకు స్కాలర్షి్పలు, మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లను పెద్దఎత్తున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.