బాపట్ల జిల్లాలో తమ సోదరిని ఆకతాయిలు ఏడ్పిస్తున్నారని ప్రశ్నించిన అమర్నాథ్ అనే విద్యార్థిని హత్య చేసిన ఘటన మనందరికీ తెలిసిందే. అమర్నాథ్ గౌడ్‌ను హత్య చేసిన హంతకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ బీసీ సెల్, బీసీ సాధికార సమితి సభ్యు లు, ఇతర బీసీ సంఘాలు, బీసీ నేతలు, కార్యకర్తలందరూ ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఒక ప్రకటనలో కోరారు.